తనయొద్ద నున్నవారినందరిని
1 సమూయేలు 22:2

మరియు ఇబ్బందిగల వారందరును , అప్పులు చేసికొనిన వారందరును , అసమాధానముగా నుండు వారందరును , అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి యాయెను . అతనియొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చియుండిరి .

1 సమూయేలు 27:2

లేచి తనయొద్దనున్న ఆరు వందల మందితో కూడ ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను.

1 సమూయేలు 27:3

దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి . యెజ్రెయేలీయురాలగు అహీనోయము , నాబాలు భార్యయైయుండిన కర్మెలీయురాలగు అబీగయీలు అను అతని యిద్దరు భార్యలు దావీదుతోకూడ ఉండిరి.

1 సమూయేలు 30:1

దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి ; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి , కొట్టి దానిని తగులబెట్టి ,

1 సమూయేలు 30:9

కాబట్టి దావీదు అతనియొద్దనున్న ఆరు వందల మందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో రెండువందల మంది వెనుక దిగవిడువబడిరి .

1 సమూయేలు 30:10

దావీదును నాలుగు వందల మందియును ఇంక తరుముచు పోయిరి గాని ఆ రెండువందల మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి . ఆ నాలుగు వందలమంది పోవుచుండగా

1దినవృత్తాంతములు 12:1-7
1

దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడియింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.

2

వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు.

3

వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి; ఇతని తరువాతివాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,

4

ముప్పదిమందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను,గెదేరాతీయుడైన యోజాబాదు,

5

ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా,

6

కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,

7

గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.

గ్రామములలో
యెహొషువ 21:11

యూదావంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి.

యెహొషువ 21:12

అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి.