అందుకు రాజు మీ దృష్టికేది మంచిదో దాని చేసెదనని చెప్పి గుమ్మపు ప్రక్కను నిలిచియుండగా జనులందరును గుంపులై వందలకొలదిగాను వేలకొలదిగాను బయలుదేరిరి.
దావీదు రెండు గుమ్మముల మధ్యను నడవలో కూర్చొనియుండెను; కావలికాడు గుమ్మముపైనున్న గోడమీదికి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరుగెత్తికొని వచ్చుచున్న యొకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా
నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను.
జనులు ఇశ్రాయేలువారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగగా
ఇశ్రాయేలువారు దావీదు సేవకుల యెదుట నిలువలేక ఓడిపోయిరి; ఆ దినమున ఇరువది వేలమంది అక్కడ హతులైరి.
యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను; మరియు నాటి దినమున కత్తిచేత కూలినవారి కంటె ఎక్కువమంది అడవిలో చిక్కుబడి నాశనమైరి.
సూర్యాస్తమయ సమయమందు దండువారందరు తమ తమ పట్టణములకును దేశములకును వెళ్లి పోవచ్చునని ప్రచురమాయెను.
యూదావారు ఇశ్రాయేలువారియెదుట నిలువలేక అపజయమొంది అందరును తమ తమ గుడారములకు పారిపోయిరి.