యోనాతాను -ఈ సున్నతిలేనివారి దండు కాపరులమీదికి పోదము రమ్ము , యెహోవా మన కార్యమును సాగించునేమో , అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయు వానితో చెప్పగా
అతడు-నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము , పోదము రమ్ము. నీ యిష్టాను సారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెను .
అప్పుడు యోనాతాను -మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందము .
వారు మనలను చూచి-మేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన యెడల వారియొద్దకు పోక మనమున్నచోట నిలుచుదము .
మాయొద్దకు రండని వారు చెప్పిన యెడల యెహోవా వారిని మనచేతికి అప్పగించెనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా
వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండుకాపరులకు అగుపరుచుకొనిరి . అప్పుడే ఫిలిష్తీయులు -చూడుడి , తాము దాగియుండిన గుహలలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు
యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి-మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను -నా వెనుక రమ్ము , యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి
అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతుల తోను కాళ్ల తోను ప్రాకి యెక్కిరి . ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతనివెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను .
యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువది మంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అర యెకరము నేల పొడుగున అది జరిగెను.
మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదున కిచ్చెను .
యెహోవా ఖడ్గము రక్త మయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్పబడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.
వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడెలును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది .