విలాపము సలిపెను
2 సమూయేలు 1:19

ఇశ్రాయేలూ, నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలములమీద హతులైరి అహహా బలాఢ్యులు పడిపోయిరి.

ఆదికాండము 50:11

ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్లము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్‌మిస్రాయిము అను పేరు పెట్టబడెను, అది యొర్దానునకు అవతలనున్నది.

2 దినవృత్తాంతములు 35:25

యిర్మీయాయు యోషీయానుగూర్చి ప్రలాప వాక్యము చేసెను, గాయకులందరును గాయకురాండ్రందరును తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి; నేటివరకు యోషీయానుగూర్చి ఇశ్రాయేలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయెను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి.

యిర్మీయా 9:17-21
17

సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.

18

మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను.

19

మనము వలసబోతిమే సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసివచ్చెనే అని సీయోనులో రోదనధ్వని వినబడు చున్నది.

20

స్త్రీలారా, యెహోవా మాట వినుడిమీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.

21

వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో ¸యవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.