తమ తండ్రి
ఆదికాండము 27:41

తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగానున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.

ఆదికాండము 27:42

రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను ఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్నుతాను ఓదార్చుకొనుచున్నాడు.

యోసేపు
ఆదికాండము 42:17

వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను.

లేవీయకాండము 26:36

మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొనిపోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.

యోబు గ్రంథము 15:21

భీకరమైన ధ్వనులు వాని చెవులలోబడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు.

యోబు గ్రంథము 15:22

తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు.

కీర్తనల గ్రంథము 14:5

ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు

కీర్తనల గ్రంథము 53:5

భయకారణము లేనిచోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడివేయువారి యెముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి.

సామెతలు 28:1

ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.

రోమీయులకు 2:15

అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను , వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయము లయందు వ్రాయబడి నట్టు చూపుచున్నారు .