మీదికి
ఆదికాండము 25:23

రెండు జనములు నీ గర్భములో కలవు.రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమైయుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

ఆదికాండము 25:33

యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమి్మవేయగా

ఆదికాండము 43:9

నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టనియెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును.

1 సమూయేలు 14:24-28
24

నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనులచేత ప్రమాణము చేయించెను, అందువలన జనులు ఏమియు తినకుండిరి .

25

జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను .

26

జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు .

27

అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము విన లేదు . గనుక తన చేతి కఱ్ఱ చాపి దాని కొనను తేనెపట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను .

28

జనులలో ఒకడు -నీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించి-ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించి యున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను .

1 సమూయేలు 14:36-45
36

అంతట-మనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి , శేషించువా డొకడును లేకుండ చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు-నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి . అంతట సౌలు-యాజకుడు ఇక్కడనే యున్నాడు, దేవుని యొద్ద విచారణ చేయుదము రండని చెప్పి

37

సౌలు -ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన యెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవునియొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తర మియ్యక యుండెను.

38

అందువలన సౌలు -జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను .

39

నా కుమారుడైన యోనాతాను వలన కలిగి నను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమాణము చేయుచున్నాననెను. అయితే జను లందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడు ఒకడును లేకపోయెను .

40

మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు -నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలు తో చెప్పిరి .

41

అప్పుడు సౌలు -ఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా , దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గాని జనులు తప్పించుకొనిరి .

42

నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను .

43

నీవు చేసిన దేదో నాతో చెప్పుమని యోనాతాను తో అనగా యోనాతాను -నా చేతి కఱ్ఱ కొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే; కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను.

44

అందుకు సౌలు -యోనాతానా , నీవు అవశ్యముగా మరణమవుదువు , నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను .

45

అయితే జనులు సౌలు తో -ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా ? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను ; యెహోవా జీవముతోడు అతని తల వెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి .

1 సమూయేలు 25:24
నా యేలినవాడా , యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడ నిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పుమాటలను ఆలకించుము ;
2 సమూయేలు 14:9

అందుకు తెకోవ ఊరి స్త్రీ నా యేలినవాడా రాజా, దోషము నామీదను నాతండ్రి ఇంటివారి మీదను నిలుచునుగాక, రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా

మత్తయి 27:25

అందుకు ప్రజ లందరువాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.