
అతనికి సౌలు అను నొక కుమారు డుండెను. అతడు బహు సౌందర్యముగల యౌవనుడు, ఇశ్రాయేలీయులలో అతనిపాటి సుందరు డొకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటె ఎత్తు గలవాడు.
అయితే యెహోవా సమూయేలు తో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్య పెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరు చుండెను. అతడు ఆరు మూళ్ల జేనెడు ఎత్తుమనిషి.