
అప్పుడు ఇశ్రాయేలీయులందరిలోనుండి ఏర్పరచబడిన పదివేలమంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠినయుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు.
వారి కాజ్ఞాపించినదేమనగా–ఈ పట్టణమునకు పడమటివైపున మీరు దాని పట్టుకొన చూచుచు పొంచియుండవలెను పట్టణమునకు బహుదూరమునకు వెళ్లక మీరందరు సిద్ధపడియుండుడి.
దావీదు యెహోవాయొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా –నీవు వెళ్లవద్దు –చుట్టు తిరిగిపోయి, కంబళిచెట్లకు ఎదురుగా వారిమీద పడుము.