we are
రోమీయులకు 6:2-15
2
అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?
3
క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణము లోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?
4
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణము లో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.
5
మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము.
6
ఏమనగా మన మికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయబడెనని యెరుగుదుము.
7
చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పుపొందియున్నాడు.
8
మనము క్రీస్తు తోకూడ చనిపోయిన యెడల, మృతు లలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు,
9
మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయన తో కూడ జీవించుదుమని నమ్ముచున్నాము.
10
ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు
11
అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.
12
కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీర మందు పాపమును ఏల నియ్యకుడి.
13
మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి , అయితే మృతులలో నుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి.
14
మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
15

అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? అదెన్నటికిని కూడదు.

కీర్తనల గ్రంథము 116:16

యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.

1 కొరింథీయులకు 6:19

మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

1 కొరింథీయులకు 6:20

విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

1 పేతురు 4:2

శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొను నట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

1 పేతురు 4:3

మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును,