
పంపబడిన వారు వెళ్లి , ఆయన తమతో చెప్పినట్టే కనుగొని
యేసు పేతురును యోహానును చూచి–మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను.
వారు–మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా
ఆయన–ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించునప్పుడు నీళ్లకుండ మోసికొనిపోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును; అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి
–నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి.
అతడు సామగ్రిగల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను.
వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.
ఈ దినమున నీవు నా యొద్దనుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులోనుండు రాహేలు సమాధిదగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడుదురు . వారు-నీవు వెదక బోయిన గార్దభములు దొరికినవి , నీ తండ్రి తన గార్దభములకొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీకొరకు విచారపడు చున్నాడని చెప్పుదురు .
తరువాత నీవు అక్కడనుండి వెళ్లి తాబోరు మైదానము నకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు ముగ్గురు మనుష్యులు నీకు ఎదురుపడుదురు ; ఒకడు మూడు మేకపిల్లలను , ఒకడు మూడు రొట్టెలను , ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచు వత్తురు.
వారు నిన్ను కుశలప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు . అవి వారిచేత నీవు తీసికొనవలెను .
ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు , అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే , స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగి వచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును , వారు ప్రకటనచేయుచు వత్తురు;
యెహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగివచ్చును ; నీవు వారితో కలిసి ప్రకటన చేయు చుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును .
దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచినదాని చేయుము .
నాకంటె ముందు నీవు గిల్గాలునకు వెళ్లగా , దహనబలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీయొద్దకు దిగి వత్తును; నేను నీయొద్దకు వచ్చి నీవు చేయవలసినదానిని నీకు తెలియజేయు వరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను .
అతడు సమూయేలు నొద్దనుండి వెళ్లిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను . ఆ దినముననే ఆ సూచనలు కనబడెను .
ఈ సంగతి సంభవించినప్పుడు, మీరు నమ్మవలెనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను.