
మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను , తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను .
పరిసయ్యుడు నిలువబడి–దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు దిగి వెళ్లుము ; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి .
మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని–యెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తుదేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?
అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి , వీని చేతికి ఉంగరము పెట్టి , పాదములకు చెప్పులు తొడిగించుడి;
క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి , మనము తిని సంతోషపడుదము ;