
ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను.
ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను.
బహు జనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా
ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా–ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను.
వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మింగివేసెను
కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని
సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను.
కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను.
కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను.
చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
బహు జనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను
–విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను . అతడు విత్తుచుండగా , కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను .
మరి కొన్ని రాతినేలను పడి , మొలిచి , చెమ్మలేనందున ఎండిపోయెను .
మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను ; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను .
మరికొన్ని మంచినేలను పడెను ; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను . ఈ మాటలు పలుకుచు–వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను .
జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి,
ఆ సరస్సుతీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.
ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.