
వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా,
అక్కడ నిలిచియున్న వారిలో కొందరు – మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.
అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.
వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను.
అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి.
పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని
ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులు– మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి.
అందుకు వారు– ఇది ప్రభువునకు కావలసి యున్నదనిరి.
తరువాత వారు యేసు నొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ బట్టలు వేసి, యేసును దానిమీద ఎక్కించి,
అంతట వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించి–యెహూ రాజైయున్నాడని చాటించిరి.