
ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల, వాడు ఏడు దినములు అపవిత్రుడగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము.
అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.
పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడ కయు, తన పొరుగువాని భార్యను చెరప కయు, బహిష్టయైన దానిని కూడ కయు,
తమ తండ్రి మానాచ్ఛాదనము తీయువారు నీలో నున్నారు, అశుచియై బహిష్టియైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు.