
నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తెయొక్కయైనను నీ తల్లి కుమార్తెయొక్కయైనను మానాచ్ఛాదనమును తీయకూడదు.
అంతేకాక–ఆమె నా చెల్లెలను మాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.
తన సహోదరితో, అనగా తన తండ్రికుమార్తెతో గాని తన తల్లికుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్ అనవలెను.
ఆమె –నా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచుకొందును?
ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును , మరియొకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును , నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు .