
లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను; వారిలో ఒక దాని పేరు ఆదా రెండవదాని పేరు సిల్లా.
యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తియైన తరువాత అతడు తన కుమార్తెయైన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను.
అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను.
ఆమె - నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు - కాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.
యెహోవా ఆమెకు సంతు లేకుండ చేసియున్న హేతువునుబట్టి , ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించు టకై , ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను.
ఎల్కానా ఆమెకు ఏటే ట ఆ రీతిగా చేయుచు నుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవు నపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను.
ఆమె పెనిమిటియైన ఎల్కానా -హన్నా , నీ వెందుకు ఏడ్చుచున్నావు ? నీవు భోజనము మానుట ఏల ? నీకు మనో విచార మెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా ? అని ఆమెతో చెప్పుచు వచ్చెను.
కొంచెముగానైనను దైవాత్మ నొందినవారిలో ఎవరును ఈలాగున చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగెను ? దేవునిచేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, ¸యౌవనమున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి.