అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారిన యెడల వాడు యాజకునియొద్దకు రావలెను;
రోమీయులకు 7:14-24
14

ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపము నకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను.

15

ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించు నదియే చేయుచున్నాను.

16

ఇచ్ఛ యింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదై నట్టు ఒప్పుకొనుచున్నాను.

17

కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు.

18

నా యందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుట లేదు.

19

నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను.

20

నేను కోరని దానిని చేసిన యెడల, దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.

21

కాబట్టి మేలు చేయ గోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది.

22

అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను గాని

23

వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.

24

అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?

గలతీయులకు 1:14-16
14

నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తిగలవాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి.

15

అయినను తల్లిగర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని

16

ఆయనను నాయందు బయలుపరపననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.

ఫిలిప్పీయులకు 3:6-8
6

ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.

7

అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.

8

నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.

1 తిమోతికి 1:13-15
13

నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.

14

మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను.

15

 

పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను