అయినను వారు
కీర్తనల గ్రంథము 34:19

నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.

కీర్తనల గ్రంథము 118:13

నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను.

కీర్తనల గ్రంథము 125:1

యెహోవాయందు నమి్మక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.

యోబు గ్రంథము 5:19

ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.

మత్తయి 16:18

మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

రోమీయులకు 8:35-39
35

క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?

36

ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడినవారము.

37

అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.

38

మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,

39

మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.

యోహాను 16:33

నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.

ప్రకటన 12:8

ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.

ప్రకటన 12:9

కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.