
పాత గుమ్మమును బాగుచేయువారు ఎవరనగా పాసెయ కుమారుడైన యెహోయాదాయును బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి.
మగ్పీయాషు మెషుల్లాము హెజీరు
మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును
లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బెతైయును యోజాబాదును దేవుని మందిర బాహ్యవిషయములో పై విచారణచేయు అధికారము పొందిరి.