ఫలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి
అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి .
వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోను లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి-మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి.
కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారు లనందరి పిలువనంపించి -ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంప కుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించు డనిరి . దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థు లందరిని పట్టి యుండెను .
ఆయన తన బలమును చెరకును , తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను .