a deadly
యెషయా 13:7-9
7

అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును

8

జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.

9

యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును.

యిర్మీయా 48:42-44
42

మోయాబు యెహోవాకంటె గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండ నిర్మూలమాయెను.

43

మోయాబు నివాసీ, భయమును గుంటయు ఉరియు నీమీదికి వచ్చియున్నవి

44

ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు గుంటలోనుండి తప్పించుకొనువారు ఉరిలో చిక్కుకొందురు మోయాబుమీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు.దేశ పరిత్యాగులగువారు బలహీనులై హెష్బోనునీడలో నిలిచియున్నారు.

హస్తము
1 సమూయేలు 5:6

యెహోవా హస్తము అష్డోదు వారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా

1 సమూయేలు 5:9

అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి , గొప్ప నాశనము జేసెను .