ఎక్రోను మొదలుకొని సముద్రమువరకు అష్డోదు ప్రాంత మంతయు,
యూదావంశస్థులు గాజాను దాని ప్రదేశమును అష్కెలోనును దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి.
అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగియై మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా
అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు .