తానును తనయొద్ద నున్న జను లందరును కూడుకొని యుద్ధము నకు చొరబడిరి . వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసికొను చుండిరి .
ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోను వరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి.
గిద్యోనును అతనితో నున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.
అతడు నా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా