మూడవ మారు
యోబు గ్రంథము 33:14

దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు

యోబు గ్రంథము 33:15

మంచముమీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో

1 కొరింథీయులకు 13:11

నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.

1 కొరింథీయులకు 13:12

ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.