Make this fellow
1 సమూయేలు 14:21

మరియు అంతకుమునుపు ఫిలిష్తీయుల వశముననున్నవారై చుట్టునున్న ప్రాంతములలో నుండి వారితోకూడ దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దను యోనాతానునొద్దను ఉన్న ఇశ్రాయేలీయు లతో కలిసికొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి.

1దినవృత్తాంతములు 12:19

సౌలుమీద యుద్ధముచేయబోయిన ఫిలిష్తీయులతో కూడ దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షముచేరిరి; దావీదు ఫిలిష్తీయులకు సహాయము చేయకపోయెను, ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణ హాని చేయునని యెంచి ఫిలిష్తీయుల అధికారులు అతని పంపివేసిరి.

లూకా 16:8

అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను . వెలుగు సంబంధుల కంటె (మూలభాషలో-వెలుగు కుమారులకంటె) ఈ లోక సంబంధులు (మూలభాషలో-ఈ యుగపు కుమారులు) తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులైయున్నారు .