దావీదు జనులు అదిగో -నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా ; దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండ అతని పైవస్త్రపు చెంగును కోసెను .
అప్పుడు అబీషై దావీదు తో -దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీ కప్పగించెను ; కాబట్టి నీ చిత్తమైతే ఆ యీటెతో ఒక్కపోటు పొడిచి , నేనతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా
దావీదు -నీవతని చంప కూడదు , యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము?
ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్యలేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను .