మరియు ఇబ్బందిగల వారందరును , అప్పులు చేసికొనిన వారందరును , అసమాధానముగా నుండు వారందరును , అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి యాయెను . అతనియొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చియుండిరి .
అంతట దావీదు వారితో -మీరందరు మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి , దావీదు కూడను కత్తి ఒకటి ధరించెను . దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండువందల మంది సామాను దగ్గర నిలిచిరి .
కాబట్టి దావీదు అతనియొద్దనున్న ఆరు వందల మందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో రెండువందల మంది వెనుక దిగవిడువబడిరి .
దావీదును నాలుగు వందల మందియును ఇంక తరుముచు పోయిరి గాని ఆ రెండువందల మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి . ఆ నాలుగు వందలమంది పోవుచుండగా