యీటె
1 సమూయేలు 18:10

మరునాడు దేవునియొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించెను.

1 సమూయేలు 19:9

యెహోవాయొద్దనుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను . సౌలు ఈటె చేతపట్టుకొని యింట కూర్చుండి యుండెను. దావీదు సితారా వాయించుచుండగా

1 సమూయేలు 20:33

సౌలు అతనిని పొడువవలెనని యీటె విసిరెను ; అందువలన తన తండ్రి దావీదును చంప నుద్దేశము గలిగియున్నాడని యోనాతాను తెలిసికొని