
యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మ యొకటి వచ్చి అతని వెరపింపగా
మరునాడు దేవునియొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించెను.
ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగా–దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించుకొనెను.