ఇశ్రాయేలీయులలో మూడు వేలమందిని ఏర్పరచుకొనెను . వీరిలో రెండు వేలమంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి ; వెయ్యిమంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్ద నుండిరి ; మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను .
ఇశ్రాయేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి .
కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్లి పోయిరి గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను; జను లందరు భయపడుచు అతని వెంబడించిరి .
సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మచెట్టు క్రింద దిగియుండెను , అతని యొద్దనున్న జనులు దాదాపు ఆరు వందల మంది .