జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను .
జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు .
అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము విన లేదు . గనుక తన చేతి కఱ్ఱ చాపి దాని కొనను తేనెపట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను .
జనులలో ఒకడు -నీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించి-ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించి యున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను .
అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను ; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి
జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్లవలన బాగుగా భోజనము చేసినయెడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను.
దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును.