షిమ్యోనీయులు
ఆదికాండము 29:33

ఆమె మరల గర్భవతియై కుమారుని కని - నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడ నాకు దయచేసెననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను.

యెహొషువ 19:1

రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశములచొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్యనుండెను.

I likewise
న్యాయాధిపతులు 1:17

యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడ పోయి జెఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలముచేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి.

2 సమూయేలు 10:11

అబీషైకి అప్పగించి సిరియనుల బలము నాకు మించినయెడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించిన యెడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తనవారిని వ్యూహపరచెను.