
ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు - ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను
నేను వింటినిగాని గ్రహింప లేకపోతిని -నా యేలినవాడా , వీటికి అంత మేమని నేనడుగగా
అతడు-ఈ సంగతులు అంత్య కాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక , దానియేలూ , నీవు ఊరకుండుమని చెప్పెను .