యెహోవాసాక్ష్యపు మందసమును మోయు యాజ కులకు యొర్దానులోనుండి యివతలికి రండని
యెహొషువ 3:3-6
3

మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసికొనిపోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలెను.

4

మీకును దానికిని దాదాపు రెండువేల కొలమూరల యెడముండవలెను. మీరు వెళ్లుత్రోవ మీరింతకుముందుగా వెళ్లినది కాదు, మీరు దానిని గురుతుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు.

5

మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.

6

మీరు నిబంధన మందసమును ఎత్తికొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవియ్యగా వారు నిబంధన మందసమును ఎత్తికొని ప్రజలముందర నడచిరి.

నిర్గమకాండము 25:16-22
16

ఆ మందసములో నేను నీకిచ్చు శాసనముల నుంచవలెను.

17

మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలునర దాని వెడల్పు మూరెడునర.

18

మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.

19

ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయ వలెను

20

ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచ వలెను.

21

నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.

22

అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రా యేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.

ప్రకటన 11:19

మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.