దానినిబట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి.
వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
అప్పుడాయన తన శిష్యుల వైపు తిరిగి -మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి ;
అనేకమంది ప్రవక్తలును రాజులును , మీరు చూచుచున్నవి చూడ గోరి చూడ కయు , వినగోరి విన కయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను .
పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించినవారిద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.