For perhaps he therefore departed for a season, that thou shouldest receive him for ever;
ఆదికాండము 45:5-8
5

అయినను నేనిక్కడికి వచ్చు నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.

6

రెండు సంవత్సరముల నుండి కరవు దేశములో నున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశ ములో మిమ్మును శేషముగా నిలుపుటకును

7

ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపిం చెను.

8

కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంప లేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటి వారి కందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను.

ఆదికాండము 50:20

మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.

కీర్తనల గ్రంథము 76:10

నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.

యెషయా 20:6

ఆ దినమున సముద్రతీర నివాసులు అష్షూరు రాజు చేతిలోనుండి విడిపింపబడవలెనని సహాయముకొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఈలాగు సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు.

అపొస్తలుల కార్యములు 4:28

వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.