ధర్మశాస్త్రము మోషేద్వారా అనుగ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.
ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.
ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.
వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసముగలవారై కలిసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్‌ప్రయోజనమైనదాయెను.
కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చి -నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము.
మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేడవ దినమునుగూర్చి ఆయన యొకచోట చెప్పియున్నాడు.
ఇదియునుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు.
కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినినవారు అవిధేయతచేత ప్రవేశింపలేదు గనుకను,
నేడు మీ రాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములో -నేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు.
యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును.
కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.
ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.
కాబట్టి అవిధేయతవలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్తపడుదము.