అతడు పాళెము నకు సమీపింపగా , ఆ దూడను , వారు నాట్యమాడుటను చూచెను . అందుకు మోషే కోపము మండెను ; అతడు కొండ దిగువను తన చేతుల లోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను .
మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొనివచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి.
ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి.