ప్రలాపన
కీర్తనల గ్రంథము 45:10

కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము

కీర్తనల గ్రంథము 45:11

ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము.

లూకా 14:26

ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషిం పకుంటే వాడు నా శిష్యుడు కానేరడు .

లూకా 14:27

మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబ డింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు .