ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటి లో పడిపోగా వాడు అయ్యో నా యేలినవాడా , అది యెరవుతెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక
ఆ దైవ జనుడు అదెక్కడ పడెనని అడిగెను ; వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను .
అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను .
అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయ పురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.
బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.