life shall
నిర్గమకాండము 21:23-25
23

హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము,

24

కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు,

25

వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.

లేవీయకాండము 24:17-21
17

ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను.

18

జంతు ప్రాణహత్యచేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను.

19

ఒకడు తన పొరుగువానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు.

20

విరుగగొట్టబడినదాని విషయములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలుగజేయవలెను.

21

జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్యచేసినవానికి మరణశిక్ష విధింపవలెను.

మత్తయి 5:38

కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.

మత్తయి 5:39

నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.