గిల్గాలు
ఆదికాండము 12:6

అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారముచేసి మోరేదగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి.

యెహొషువ 5:9

అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసియున్నానని యెహోషువతో ననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గాలను పేరు.

న్యాయాధిపతులు 7:1

అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితో నున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెము వారికి కనబడెను.