అనుమానించువాడు
1 కొరింథీయులకు 8:7

అయితే అందరియందు ఈజ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.

damned
రోమీయులకు 13:2

కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు .

1 కొరింథీయులకు 11:29-31
29

ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.

30

ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునైయున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.

31

అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల తీర్పు పొందకపోదుము.

కానిది ఏదో
తీతుకు 1:15

పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడియున్నవి.

హెబ్రీయులకు 11:6

విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.