అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.
అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము ; ఎవరైనను నీకు ఎదురుపడిన యెడల వారికి నమస్కరింప వద్దు ; ఎవరైనను నీకు నమస్కరించిన యెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు ; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను.
తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు , నేను నిన్ను విడువ నని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడ పోయెను .
గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను గాని యే శబ్దమును రాకపోయెను , ఏమియు వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఏలీషాను ఎదుర్కొన వచ్చి బాలుడు మేలుకొన లేదని చెప్పెను .
తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు
కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.