
వారు–నీ కన్నులేలాగు తెరవబడెనని వాని నడుగగా
వాడు–యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి–నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను.
వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేనెరుగననెను.
అంతకుముందు గ్రుడ్డియై యుండినవానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి.
యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము
వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు–నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగు కొని చూపు పొందితినని వారితో చెప్పెను.
–నీవు క్రీస్తు వైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన– నేను మీతో చెప్పిన యెడల మీరు నమ్మరు.