
అందుకు ఆ మనుష్యుడు–ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను.
అందుకు వాడు–నన్ను స్వస్థపరచినవాడు–నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.
ఆ సాక్ష్యమేమనగాదేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది.