సున్నతి సంస్కారమును
ఆదికాండము 17:10-14
10

నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను.

11

మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.

12

ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను.

13

నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును.

14

సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టి వేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను.

లేవీయకాండము 12:3

ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను.

రోమీయులకు 4:9-11
9

ఈ ధన్యవచనము సున్నతిగలవారిని గూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారిని గూర్చి కూడ చెప్పబడినదా? అబ్రాహాము యొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడె ననుచున్నాము గదా ?

10

మంచిది; అది ఏ స్థితి యందు ఎంచబడెను ? సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా ? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే .

11

మరియు సున్నతి లేని వారైనను, నమ్మిన వారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై , అతడు సున్నతి పొందకమునుపు , తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా , సున్నతి అను గురుతు పొందెను .

గలతీయులకు 3:17

నేను చెప్పునదేమనగా నాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు.