యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలనుకూడ పంచిపెట్టెను.
లూకా 24:42

వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి .

లూకా 24:43

ఆయన దానిని తీసికొని వారి యెదుట భుజించెను .

అపొస్తలుల కార్యములు 10:41

ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.