అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.
వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా ? నిన్ను నీవు రక్షించుకొనుము , మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను .
అయితే రెండవవాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా ?
మనకైతే యిది న్యాయమే ; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయ లేదని చెప్పి
ఆయనను చూచి యేసూ , నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను .
అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడ పరదైసు లో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను .