చూడలేదా
సామెతలు 12:19

నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.

మత్తయి 26:73

కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి–నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.

మార్కు 14:70

అతడు మరల–నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచి–నిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి.

మార్కు 14:71

అందుకతడు–మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి, శపించుకొనుటకును ఒట్టు బెట్టుకొనుటకును మొదలు పెట్టెను.

లూకా 22:59

ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు–నిజముగావీడును అతనితో కూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను.

లూకా 22:60

అందుకు పేతురు–ఓయీ, నీవు చెప్పినది నాకు తెలియ దనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను.